బి.ఆర్.ఎస్.గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల బి.ఆర్.ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శుక్రవారం సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ యూత్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,గ్రామ అధ్యక్షులు సదిరం రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు.
వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో.. సదిరం ప్రవీణ్,చాతాల సతీష్, సదిరం సుభాష్ చంద్ర బోస్,శివ, నర్మేట కుమారస్వామి,ఎతోరీ రంజిత్,గుగులోత్ ఈశ్వర్,ఎర్ర చంద్ర,బర్ల రాజుకిమార్ లతో పాటు తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.