బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి గారు అన్నారు. శుక్రవారం 15 డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతి గారు మాట్లాడుతూ…పరకాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. గతంలో ఉన్న నాయకులు చేసిన అభివృద్ది, ఇప్పుడు ఉన్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు.గ్రామాల్లో ఇతర పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
అధిష్టానం వద్ద కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్న చల్లా ధర్మారెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తమ నాయకుడు చల్లా ధర్మారెడ్డి గారికి అధిక మెజారిటీతో గెలిపించాలని దండంపెట్టి వేడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, నాయకులు,కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 453