వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పచ్చిపాల వేణు యాదవ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మరియు కోదాడ నియోజకవర్గం ఇంచార్జి పదవులకు రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని కూల్చి టైర్లతో తలగపెట్టిన పార్టీకి మద్దతు ఇవ్వలేకనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు, పార్టీలో ఇప్పటివరకు క్రియాశీలకంగా వివిధ హోదాలో అవకాశం ఇచ్చిన షర్మిలమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు