కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 129- సూరారం డివిజన్ హెచ్ఎంటి సొసైటీలో బిఆర్ఎస్ నాయకుడు వరప్రసాద్, శరణ్ గౌడ్, శాంతి రెడ్డి మరియు బిజీ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో 500 పైచిలుకు మంది ప్రభుత్వ విప్ – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గార్ల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో ముందుకు సాగుతుందన్నారు.
దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని రాబందులైన ప్రతిపక్ష పార్టీల చేతుల్లో పెట్టొద్దన్నారు. సంక్షేమాన్ని కొనసాగించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : సాయి కృష్ణ యాదవ్, రవికుమార్, సూర్య, సాయి యాదవ్, మహేష్, సాయి శివ తేజ, సాయి కిరణ్, వివేక్ లతో పాటు 500 మంది పైచిలుకు మంది…ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.