ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్ళీ తెలంగాణ దే ఘణ విజయమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం”దారి చూపిన దశాబ్ది”పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల రాష్ట్ర ప్రగతి పథం దేశ పాలనా చరిత్ర లో నూతన అధ్యాయమని అన్నారు.
సాగు, సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో సీఎం కేసీఆర్ అమలుచేసిన విధానాలు అధ్భుతమైన ఫలితాలనిచ్చాయన్నారు.దేశంలో ఒకటో, రెండో రంగాల్లో మిశ్రమ ఫలితాలకే క్షీర విప్లవం, హరిత విప్లవమని కాంగ్రెస్,బిజెపి సర్కార్ లు డబ్బా కొట్టుకున్నాయని,కానీ అన్ని రంగాల్లో మన తెలంగాణ రాష్ట్రం సాధించిన పదేళ్ల ప్రగతి విప్లవాన్ని బుధ్ధి జీవులు ఎంత ప్రజల్లో భావవ్యాప్తి చేయాలో అర్థం చేసుకొని,భాధ్యత తీసుకోవాలని కోరారు.
తన వ్యాసాల ద్వారా తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఎత్తి పట్టడంతో పాటు, బిజెపి, కాంగ్రెస్ ల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేస్తున్న ఆంజనేయ గౌడ్ కృషి ప్రశంషనీయమన్నారు.ఆలోచన పరులు కీలకమైన ఎన్నికల సంధర్భంగా క్రియాశీల పాత్ర పోషించి,బీఆర్ఎస్ గెలుపు లో భావవ్యాప్తి కి సారధ్యం వహించాలని అన్నారు.అనంతరం ఆంజనేయ గౌడ్ సారధ్యంలో పాలమూరు గాయకుడు రేలారే ప్రసాద్ రచించి, ఆలాపించిన “గుండెకత్తుకుందమా..గులాబీ జెండా ను” పాటను సహితం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి రవీందర్ రావు,మాజీ ఎంఎల్ సి కర్నే ప్రభాకర్,తెలంగాణ గాయకుడు రేలారే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.