పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నవంబర్ ముప్పైన వేలుకి ఇంక్.. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అంతటా పింక్.. పక్కాగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం..వచ్చిన తర్వాత ఆడబిడ్డ లకు రూ.400కే సిలిండర్ ఇస్తాము ..ఆసరా పెన్షన్ రూ.5000 కాబోతుంది .అడబిడ్డలకు నెలకు రూ.3000 చొప్పున ఇచ్చే పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయబోతున్నారని,దీంతో ఇంట్లో అత్తకు రూ.5000 పెన్షన్ , కొడలుకు రూ.3000 రాబోతున్నాయని,కేసీఆర్ బీమా ద్వారా ఏ ఆధారం లేనివారికి రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించబోతున్నామని అన్నారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూముల రేట్లు పెరిగాయని అన్నారు.టెక్స్ట్ టైల్ పార్క్ లో ఎంతో మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.పదేండ్లు పత్తా లేని రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికలనగానే వచ్చి నాకు ఓట్లేయమని అడుగుతుండు..
నియోజకవర్గంలో ప్రతి రోజు కాంగ్రెస్ పార్టీ నుండి యువకులు,నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరుతుండటంతో దిక్కుతోచని పరిస్థతుల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు.కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు.ఇక ప్రజలెక్కడ నమ్ముతారు.ప్రకటించిన అభ్యర్థులకే గ్యారంటీ లేదు..ఇక ఆరు గ్యారంటీలకు దిక్కు ఎక్కడది..?.కాంగ్రెస్ అంటే కబ్జాలు..స్కాములు..నీళ్ల నుండి నిప్పు వరకు..నేల నుండి ఆకాశం వరకు అన్నింట్ల స్కాములు..కుంభకోణాలు.అసలు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్టపగలు ఎమెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి బెయిల్ పై బయట ఉన్న దొంగ.అలాంటి దొంగ నాయకత్వంలో పని చేస్తూ ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తుండు రేవూరి..సాక్షాత్తు సోనియా గాంధీ,రాహుల్ గాంధీలు నేషనల్ హైరాడ్ స్కాములో విచారణ ఎదుర్కుంటున్న దోషులు.. ఇలాంటి నాయకత్వం కింద పని చేస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల ప్రజలు నవ్వుకుంటున్నారు.ఒకరిపై విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి.
ఆరుగ్యారంటీలంటూ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటుంది..పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఇదే విధంగా ఆరు గ్యారంటీలంటూ కన్నడ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలలు తిరగకముందే చేతులేత్తేసిన వార్తలను రోజు చూస్తునే ఉన్నాము..అలాంటి కాంగ్రెస్ ను నమ్మితే ఆగమయినట్లే..కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు..నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు..రైతన్నలు ఆత్మహత్యలు.. మహిళలకు రక్షణ లేకపోవడం ..ఇలాంటి కాంగ్రెస్ ను ఆదరిద్దామా..?బీఆర్ఎస్ అంటే ఇరవై నాలుగంటల కరెంటు.. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి స్వచ్చమయిన తాగునీళ్లు..కాళేశ్వరం ప్రాజెక్టు..కళ్యాణ లక్ష్మీ..కేసీఆర్ కిట్లు ఇలా ఒక్కటెమిటి నాలుగోందల సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఘనమైన చరిత్ర సొంతం..నర్సంపేట,వరంగల్ వెస్ట్ మాదిరిగా పరకాల ప్రజలు కూడా ఓడించడం ఖాయమని తెల్సి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రగల్భాలు…అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు..పచ్చబడిన తెలంగాణను చూసి ఊరుకోలేక రాబంధులు వచ్చినట్లు మళ్లీ మనముందుకు వస్తున్నారు..,కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మితే అగమై గోస పడేది మనమేని ఆలోచించుకోవాలాని అన్నారు.ఎవరు మన మధ్య ఉన్నారు,ఎవరు మనతో ఉన్నారు. ఎవరు మనకు మంచి చేస్తున్నారు.. పదేండ్లలో చేసింది చాలా ఉంది..ఇంకా చేయాల్సిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..