ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ పై బయటకోచ్చిన సంగతి తెల్సిందే. అయితే మరో కేసులో అనగా ఫైబర్ నెట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన సంగతి కూడా విదితమే.
ఈ స్కాంలో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ పిటిషన్ విచారణను ఈ నెల ముప్పై తారీఖు వరకు వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు బాబును అరెస్టు చేయద్దు అని కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
స్కిల్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఆ కేసు తీర్పు తర్వాతనే ఫైబర్ నెట్ పై విచారణ చేపడతామని వ్యాఖ్యానించింది.