తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పాలన అంటే కరెంటు ఖతమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌కు గతంలో 11 ఛాన్సులు ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని నిలదీశారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు అక్కడి రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంట్ కోసం రైతులు విద్యుత్ స్టేషన్లలో మొసళ్లు వదిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలు.. మళ్లీ ఉద్దరిస్తామని తిరుగుతున్నారని కేటీఆర్ విమర్శించారు.