కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సతీష్ గట్టొజీ, వార్డ్ మెంబర్ లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు రషీద్ ల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన కిద్మత్ ఆర్గనైజేషన్ అండ్ టీం (అర్ఫత్ అండ్ ఫ్రెండ్స్), క్రీస్తు చర్చ్ సభ్యులు, మౌనిక అండ్ టీం ల సభ్యులు దాదాపు 500 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం గిరి నగర్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో క్రాంతి కుమార్ (పింటు) మరియు వారి మిత్ర బృందం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్ గార్ల సమక్షంలో దాదాపు 300 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక వాగ్దానాలు చేసి నెరవేర్చామని చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : క్రాంతి కుమార్, సోనూ, సాయి, చింటూ, అక్షయ్, బన్నీ, ప్రేమ్, వంశీ, గౌతమ్, విష్ణు, ప్రమోద్, యాకూబ్ లు…
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదీర్, సుబ్బారెడ్డి, కాజా భాయ్, సిరాజ్, రామకృష్ణ ముదిరాజ్, బాయ్, భాస్కర్ రెడ్డి, డేగ రాము, అరువ సాయి, మహబూబ్ బి,, నవాజ్, అన్సార్, మోహన్ రెడ్డి, హఫీజ్, రాజిరెడ్డి, మతిన్, అర్షద్, అల్లవుద్దీన్, సుధాకర్, బిఆర్ఎస్ మహిళా నాయకురాలు భారతి, ఈశ్వరి, ఇర్ఫాన్, వేణు, అమరేంద్ర చారి, ఫిరోజ్, అబుఖాన్, మోహన్, కుమార్, శ్రీను గుప్తా, ఆసిఫ్, నాయిద్, అల్లావుద్దీన్, మేరీ, రమ్మీ గౌడ్, సల్మాన్, చోటు, శేఖర్, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.