Home / SLIDER / తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి

తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్కడే సరైన వ్యక్తి అని సినీనటుడు, ఏపీ ఫిలిం, టీవీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, మానవతావాది అని, ఆయనను వదులుకోవద్దని, మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోసాని మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ మంచికి మంచి, చెడుకు చెడు ఉంటారు. భోళాశంకరుడు, వెరీ హానెస్ట్‌’ అని ప్రశంసించారు.

తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని మొదటినుంచీ తాను కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానం ఇలా తెలంగాణ ఆత్మ మొత్తం అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. బక్కపలుచగా ఉన్న కేసీఆర్‌ శరీరం సహకరించకపోయినా ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అది ఆయన కమిట్మెంట్‌’ అని పేర్కొన్నారు.

నాడు కేసీఆర్‌కు ఏదైనా అయితే తెలంగాణలో ఒక్కో వ్యక్తి ఒక్కో అగ్నిగోళం అవుతాడని కాంగ్రెస్‌, బీజేపీకి భయం పట్టుకున్నదని, అందుకే తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చాయని చెప్పారు. అందుకే కేసీఆర్‌కు రాష్ట్రం తెచ్చిన ఘనత దక్కిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా మేధావులని, అయితే దానికి నాయకత్వం వహించే సమర్థత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని అన్నారు. అందుకే కేసీఆర్‌ను తాను ‘తెలంగాణ గాంధీ’గా అభివర్ణిస్తానని వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat