కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకీ ఆహ్వానించిన ములుగు ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు గారు,రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మరియు నాలుగు మండలాల ఎన్నికల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ గారు .
ఇరువురు మాట్లాడుతూ,బీజేపీ కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రజలు మోసపోవద్దు,60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడిందన్నారు, మతం పేరుతో బిజెపి రాజకీయం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు,అందరి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమన్నారు.
ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు, కాంగ్రెస్ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు ప్రశ్నించవలసిన అవసరం ఉందని అన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే మళ్ళి కేసీఆర్ సీఎం కావాలన్నారు.