తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజుల రామారావు డివిజన్ పరిధిలోని ప్రాణవాయువు ఆక్సిజన్ పార్కులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ పార్క్ ప్రారంభమైన విషయాన్ని ప్రజలకు తెలియ పరుస్తూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించడానికి నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాడు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు