Home / SLIDER / బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు (శుక్రవారం ) బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి గులాబీ కండువా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ…“ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాసాని జ్ణానేశ్వర్ గారు నాకు పాత మిత్రులు, ఎప్పుడో రావాల్సింది మీదగ్గరికి కాస్త లేటైందని” కాసాని అన్నారు. బండ ప్రకాష్ తో పాటు కాసాని కి సముచితం స్థానం కల్పించేవాడిని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు మనస్పూర్తిగా స్వాగతం తెలుపుతున్నాము. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తాము. రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయి.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఈటలరాజేందర్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసానిగారు, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

కాసానితో పాటు టిడిపి మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేసిన ప్రకాష్ ముదిరాజ్, టిడిపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేష్ ముదిరాజ్, పటాన్ చెరువు కాంగ్రెస్ లీడర్ సపానాదేవ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టిడిపి కరీంనగర్ నియోజవర్గ ఇంఛార్జ్ కనకయ్య ముదిరాజ్, టిడిపి ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టిడిపి బాన్సువాడ ఇంఛార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, టిడిపి స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్, ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్, మేడ్చల్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులు ముదిరాజ్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జగదీష్ యాదవ్, టిడిపి స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి మాజీ ఎంపిటిసి నందిగామ సత్యనారాయణ, టిడిపి నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లష్కర్ అశోక్ కుమార్, టిడిపి గుడి మల్కాపూర్ అధ్యక్షుడు అక్కెర శివరాజు ముదిరాజ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat