పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్)లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా సపాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ కనుకుంట్ల నరేష్, యూత్ నాయకులు రాంపెల్లి హరీష్, సుధాగాని అశోక్, సుధాగాని శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే తొర్రూరు మండలం, ఫత్తేపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎస్.కే జానీమియా ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.