తాండురు మండల బూత్ కమిటీ మరియు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల, ముఖ్య నాయకులు సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య గారితో హాజరైన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు.
ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించి బెల్లంపల్లి అభివృద్ధిని కొనసాగించాలని ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టి ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి,గడపగడపకు వివరిస్తూ, గత ప్రభుత్వాల విఫలాలను వివరించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.