కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 128 చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎల్ బీ నగర్ మరియు పద్మశాలి బస్తి లో కాలనీవాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలపై చురుగ్గా స్పందించే నాయకుడు కె.పీ.వివేకానంద్ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటేనే సుపరిపాలన, సంక్షేమం సాధ్యమని నమ్ముతున్నాము..
వారి అడుగుజాడల్లో నడుస్తూ కాలనీ అభివృద్ధికి తోడుంటామని నవంబర్ 30 వ జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వివేకానంద్ గారికే తమ సంపూర్ణ మద్దతు అని, వారిని ముచ్చటగా మూడవ సారి లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఎన్ ఎల్ బీ నగర్ మరియు పద్మశాలి బస్తి వెల్ఫేర్ అసోసియేషన్ : కే.పీ.వెంకటేష్, ఎం. బస్వరాజ్, ఏ.ప్రభాకర్, రాజా బ్రహ్మం, నర్సయ్య, రాములు గౌడ్, బాలస్వామి, స్వర్ణ లతా, ప్రకాష్, విజయ లక్ష్మి, స్వప్న, చంద్రశేఖర్, గౌతమ్, సంపత్ గౌడ్, ఆర్.కుమార్, కె.ఉమా శంకర్, జి.సాయిబాబా, ఎస్. ప్రకాష్ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులూ మహమ్మద్ రఫీ, మఖ్సూద్, కర్నేకంటి మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.