కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీలో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద్ అన్నారు. ఈ రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డ్ జయభేరి టవర్స్ మరియు బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద గారు పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తూ సంక్షేమంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపామన్నారు.ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, పీఏసిఎస్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులూ జె.కుమార్, లక్ష్మణ్ గౌడ్ సంక్షేమ సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
