పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీని బతికించానని తెలిపారు.
ఇంతచేసినా తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. సర్వేల పేరు తో మోసం చేశారని, ఇవాళ పార్టీని తెలంగాణలో నాశనం పట్టించారని ఆగ్రహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం బాధగా ఉన్నదన్నారు. కార్యకర్తలతో సమావేశం భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానని నాగం తెలిపారు.