ప్రస్తుతం వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా నేడు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. అతను మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. కెప్టెన్ రోహిత్ కూడా దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అవుతుంది.
అయితే హిట్‌మ్యాన్ ఆడతాడా? లేదా? అనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి ముందే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ గాయం తీవ్రతను పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.