ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేండ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.
అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకను మోడల్‌గా చూపిస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. కన్నడ రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.