ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొని, మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పై తుమ్మల నాగేశ్వరరావు అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తుమ్మల వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ పై అసత్య ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..
విలేకరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, వైరా అభ్యర్థి మదన్ లాల్, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.