తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరుగా కొనసాగుతున్నది. తాజాగా మునగాల మండలంలోని మరసకుంట తండా, ఈదులవాగు తండా గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సారధ్యంలో కోదాడ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
కనుమరుగు అవుతున్న కుల వృత్తులకు ఊతం ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అనీ, రాజకీయాల కోసం మా కులాన్ని కీలు బొమ్మగా వాడుకున్నారు తప్పా ఏ పార్టీ మా కోసం పని చేయలేదన్నారు. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మాకు తగిన గుర్తింపు, చేతినిండా పనితో ఆర్థికంగా బాగుపడ్డామని తెలిపారు.
అందుకే పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే ట్లాడుతూ..పార్టీలో చేరిన వారందరికి అండగా ఉంటామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు.