గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామనికి చెందిన కుమ్మరి కనకయ్య వారి కుమారుడు బాస్కర్ ఇటీవల కరెంట్ షాక్తో తండ్రీకొడుకులు ఇద్దరు మరణించగా ఈరోజు భారస మండల అధ్యక్షుడు బెండే మధుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు .
ఈ సందర్భంగా వారికి 50 వైల రూపాయలు గౌ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. అదేవిదంగా శేరిపల్లి గ్రామానికి చెందిన మంద భూపాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని మరియు రిమ్మనగూడా గ్రామానికి చెందిన ఎంకపల్లి రాజయ్య మరణించగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బొల్లారం ఎల్లయ్య భారస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ శివయ్య, ఎంపీటీసీ రాజిరెడ్డి నాయకులు అశోక్ రావు,బిమప్ప శ్రీనివాస్ రెడ్డి, రాజాగౌడ్,ఆంజనేయులు , మల్లయ్య, నరేందర్ రెడ్డి, బాల్రాజు గౌడ్, కనకయ్య, యశ్వంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..