సూరారం డివిజన్ కు చెందిన బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. ఎస్. వాసు, బీజేపీ 130 డివిజన్ ప్రెసిడెంట్ గుబ్బల లక్ష్మి నారాయణ, బీజేపీ 130 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆడబళ్ళ వెంకట రత్నం, బీజేపీ ముస్లిం మైనారిటీ డివిజన్ఎం ప్రెసిడెంట్ ఎం.డీ. అజీజ్, అసెంబ్లీ సోషల్ మీడియా కో కన్వీనర్ ఎస్.కె.అనోక్, బీజేపీ క్రిస్టియన్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ దారేళ్ళ రవి, బీజేపీ 130 డివిజన్ బూత్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర్, ఆదర్శ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్సింహా చారి లను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద గారు.
బిజెపి వంటి మతతత్వ పార్టీలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భవిష్యత్తు లేదు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అన్నారు. కుత్బుల్లాపూర్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుతూ ఈరోజు 130 – సూరారం డివిజన్ కు చెందిన బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. ఎస్. వాసు వారి బృందంతో ఎమ్మెల్యే వివేకానంద గారు కలిసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, అభివృద్ధిలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద గారి ఆహ్వానానికి సానుకూలముగా స్పందించిన ఎం. ఎస్. వాసు గారు తన బృందంతో త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరుతామని తెలియజేశారు.