తెలంగాణలో ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి తిరుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని జీళ్ళ చెరువు గ్రామంలో ఈనెల 27న ప్రజా ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న విషయం తెలిసిందే… ఈ సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు మాట్లాడుతూ..: కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది..
అప్పుడు ప్రజలకు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు తెలుసనీ అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆనాడే తెలంగాణ రాష్ట్ర ఇచ్చి ఉండుంటే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేకదాని CM కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత 1200 మంది బలి తీసుకున్నారని, కనీసం అప్పుడు తెలంగాణ ఇచ్చిన ఆత్మ బలిదానాలు తగ్గేవని దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని విమర్శించారు. ఈనాడు తుమ్మల పొంగులేటి మాట్లాడుతున్నట్లుగా అవినీతి ప్రభుత్వంగా ఏర్పడిందని అక్రమ కేసులు పేడుతున్నారని, బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, నిన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో నాయకత్వం వహించింది మీరు కాదా అని దుయ్యబట్టారు..
మీ మనుగడ కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం, పదవీకాంక్ష కోసం పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేయడం మీ సంస్కారాన్ని తెలియజేస్తుందని, ఖమ్మం జిల్లా ప్రజలు మీ మాయ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని విజ్ఞులైన ఖమ్మం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈనెల 27 తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను పాలేరు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.