తెలంగాణ పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ పార్టీపై పరకాల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. పరకాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడూతూ.. తెలంగాణలో అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అమలు చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందు ఇరవై నాలుగంటల కరెంటు అని చేతులేత్తేసి మూడు గంటలు ఇస్తామని అంటున్నారు. రైతులు ఏకంగా కరెంటు సబ్ స్టేషన్ల ముందు మొసళ్లను వదులుతున్నారు.. సాక్షాత్తు కర్ణాటకకు చెందిన రైతులే తెలంగాణకు వచ్చి మేము కాంగ్రెస్ ను నమ్మి ఆగమయినం.. మీరు నమ్మకండి .. బీఆర్ఎస్ ను నమ్మండి అని అంటున్నారు..
కేసీఆర్ గార్ని గెలిపించండి అని రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ప్రచారం చేస్తున్నారు. ఇది అబద్ధం అని నిరూపించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా..?. దళిత బంధు వద్దంటారు.. రైతుబంధును రద్ధు చేస్తామంటరు.. ఆసరా పించన్లను తగ్గిస్తామంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ అరవై ఏండ్లు వెనక్కెళ్తాం.. నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని,బోగస్ మాటల బిజెపిని బొందపెట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.