కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 – గాజులరామారం పరిధిలోని చంద్రగిరి నగర్ కు చెందిన బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సుజాత గారి ఆధ్వర్యంలో కారుణ్య మహిళా పొదుపు సంఘాల ప్రెసిడెంట్ షహీదా బేగం వారి బృందం 200 మంది మహిళలు కెసిఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యేగారి సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేసి పార్టీ బలోపేతనికి కృషి చేయాలనీ పిలుపునిచ్చారు .
పార్టీలో చేరిన బి లతా సెక్రటరీ, ట్రెఅసురేర్ పర్వీన్ బేగం, వైస్ ప్రెసిడెంట్ రేష్మ, స్నేహ, సవిత, అనిత, పద్మ, తబ్బసుమ్, జారిన, షహీదా, రెహానా ను కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘ నాయకులు, మహిళా నాయకురాలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.