కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, చెన్నకేశవ నగర్, మరియు ద్వారకా నగర్ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అనంతరం ఉషోదయ కాలనీ, సంస్కృతి ఎనక్లేవ్, మరియు షిరిడి హిల్స్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ బస్తి లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను బస్తి వాసులుకు అందరికి అందించడానికి కృషి చేస్తునందుకు గాను రానున్న ఎన్నికలలో బస్తి వాసులు అందరు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మా బస్తి అభివృద్ధిని ఇలాగె కొనసాగించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసారు.
అనంతరం దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ – ప్రెసిడెంట్ నున్న శేఖర్, వెంకట్ నాయిని, దుర్గ ప్రసాద్, కే శ్రీనివాస్, దివాకర్, బి ఏకాంబరం, రాజేష్ గౌడ్, శివ, శ్రవణ్ రెడ్డి, గోవర్ధన్, రంజిత్, ఎస్ కే అన్వార్, కిశోరె రెడ్డి, సంక్షేమ సంఘ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.