తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని గుర్తించి తిరిగి పార్టీలో చేరిన దుబ్బాక నియోజకవర్గం, చేగుంటకు చెందిన తీగుల్ల భూమలింగం గౌడ్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు.వచ్చే ఎన్నికల్లో గెలిచి బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు.
మన మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను తీర్చేలా ఉందన్నారు. ఇంటింటికి తాగు నీరు,24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత బి ఆర్ ఎస్ కే సాధ్యమైందన్నారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్ష స్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. దుబ్బాకలో బిఆర్ఎస్ జండా ఎగరబోతున్నదని చెప్పారు.బి ఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.