తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
తాజాగా సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు పార్టీకి రాజీనామా చేశారు.పాలవరపు వేణుతో పాటు 215 మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు.