తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గారు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోను ప్రజల మేనిఫెస్టో అని, తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన సీఎం కేసీఆర్ గారు ఈ మేనిఫెస్టోలోని హామీలను వందశాతం అమలు చేస్తారని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 – జీడిమెట్ల డివిజన్ కాగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ గౌడ్ గారు ఈ రోజు ఎమ్మెల్యే వివేకానంద గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ కండువా కప్పుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన మేనిఫెస్టో ఇది అని ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాకు విజయం చేకూర్చే మేనిఫెస్టో ఇది అని, అలాగే గులాబీ జెండా కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దే హట్రిక్ విజయం అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు బిక్షపతి గౌడ్, జాయింట్ సెక్రటరీ విజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపి రెడ్డి, సీనియర్ నాయకులు పరమేశ్వర్ గౌడ్, రమేష్, సత్యా రామ్, రామాంజనేయులు, నరేంద్ర మోహన్, శ్రీధర్, కరుణాకర్ రెడ్డి, సోమయ్య, శివ కుమార్, సాయి వసంత్, ధనుష్ రెడ్డి, శిరీష, శైలజ మరియు బి.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు..