బోథ్ నియోజకవర్గంలో బజార్ హత్నూర్ మండలకేంద్రంలో కార్యకర్తల సమావేశం పాల్గొనే ముందు పీప్రి గ్రామంలో ఉన్న మహానియులు గౌరవ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి, మహాత్మగాంధీ,కొమరం భీం గార్ల విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించి దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం…కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన గోడం నగేష్ గారు.పది సంవత్సరాల పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం అయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు..!!
BRS పార్టీకి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని అభిప్రాయపడ్డారు…!!ఈరోజు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో స్థానిక తిరుమల గార్డెన్లో నిర్వహించిన BRS పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు…!!
ఈ సందర్భంగా గౌరవ బోథ్ నియోజకవర్గ ఇంచర్జి శ్రీ. గోడం నగేష్ గారు మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు BRS ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బిఅర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బిఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు.