తెలంగాణను తెచ్చి గత పదేండ్లుగా అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న కేసీఆర్ ను ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటేసి , మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా మండలం దుద్దేపూడిలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు.
మదన్ లాల్ మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని అన్నారు. పదేళ్ళలో అంతులేని అభివృద్ధి జరిగిందని, ప్రతి గుమ్మానికి ఏదో పధకం కింద లబ్ది జరిగిందని, పార్టీలకతీతంగా కేసీఆర్ ను చూసి, మదన్ లాల్ ను గెలిపించాలన్నారు. రేయింబవళ్లు కలసి మెలసి శ్రమించాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి , అభివృద్ధి గురించి వివరించి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు ముళ్లపాటి సీతారాములు, జెట్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ పావని, కట్టా కృష్ణార్జునరావు, డేరంగుల బ్రహ్మం, షేక్ లాల్ అహ్మద్, ఏలూరి మహేశ్వర రెడ్డి, మద్దెల రవి, సర్పంచ్, ఎంపీటీసీ లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.