చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద..
కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ఎమ్మెల్యే వివేకానంద గారితో కలిసి నడుస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన 130 – డివిజన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు..
ఈ రోజు 130 – డివిజన్లో జరిగిన బి.ఆర్.ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్బంగా డివిజన్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం వారు దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేకానంద గారిని కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ మద్దతు వివేకానంద గారికే అని ఏకేగ్రీవ తీర్మానం చేశారు. 30.11.23 నాడు జరిగే ఎన్నికలలో వివేకానందగారికే ఓటు వేసి వారిని ముచ్చటగా మూడవ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్బంగా వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, మన్నే రాజు, బోబ్బా రంగ రావు, గర్డాస్ రాజశేఖర్, అడపా శేషు, సిరిపల్లి పద్మజ, ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రకాష్ గుప్త, అశోక్ గుప్త, భీమేష్ గుప్త, కిరణ్ గుప్త, శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు…