సీయం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని, మూడవ సారి బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ , దేవాదాయ శాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలం వాస్తవపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అపూర్వ స్వాగతం లభించింది. గుస్సాడీ నృత్యంతో, మంగళహారతులతో, బతుకమ్మ ఆటపాటలతో మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. వృద్దులు, యువ ఓటర్లను కలుస్తూ… అభివృద్ధి ఆగవద్దు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిపేస్టో నిరుపేదలకు వరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని మాటిచ్చారు. అంతకుముందు వాస్తవపూర్ అంజనేయ స్వామిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ రాక ముందు మన బతుకులు ఎట్లుండే.. తెలంగాణ వచ్చినంకా మన బతుకులు ఎట్ల బాగుపడ్డాయో మనమ కళ్ల ముందు కనపడుతుంది. వాస్తవపూర్ కు 25 ఏండ్ల క్రితం వరకు రోడ్ లేకుండే. ఒకప్పుడు ఈ ఊరుకు రావాలంటే ఒక రోజు పడుతుండే. గతంలోనే ఈ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాం. ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి మూడు నిమిషాల్లోనే వస్తున్నం. గిరిజనులు లేని కల్మషం లేని మనుషులు, కోపతాపాలు ఉండవు. ఎన్నికల సమయంలో మీ ఊరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవం అనవాయితీగా మారింది. అందుకే మీ ఆశీర్వాదం కోసం మీ ఊరికి వచ్చిన. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించండి. ఎల్లవేళలా మీకు అండగా ఉంటాను.
తెలంగాణ వచ్చినంకా తండాలను గ్రామపంచాతీయలుగా చేసినం. అన్ని సౌకర్యాలు కల్పించాం. సీసీ రోడ్లు, డ్రైనేజీ, 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగు నీరు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ పల్లెలు, తండాలు ఎంతో అభివృద్ది చెందినాయి. అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, గిజనులకు పోడు పట్టాల పంపిణీ, వాటికి రైతుబంధుతో పాటు గిరివికాసం క్రింద బోర్లకు సబ్సీడి ద్వారా మోటర్లు ఇలా అన్ని పథకాలను ఇస్తున్నం. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదు.
ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఈ తొమ్మిదన్నర ఏళ్లలో ఊరువాడలో అన్ని సౌలత్ లు కల్పిచాము. సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇగ ఎన్నికల ఎప్పుడూ మీ ఊరి ముఖం చూడని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మీ ఇంటికి వస్తున్నారు. వారిని ఒకటే మాట అడగండి… బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్న ఒక్క సంక్షేమ పథకమైనా అమలవుతుందా అని. మరి అక్కడ ఇవ్వనోళ్ళు ఇక్కడ ఎలా ఇస్తారో నిలదీయాలా వద్దా వారు చెప్పే మాటల్ని మనం నమ్ముదామా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ తోనే మరింత అభివృద్ధి సాధ్యమని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు