రాబోవు అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపును కాంక్షిస్తూ పట్టణ పరిధిలోని 14 వ వార్డు గాంధీ నగర్ లో పట్టణ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో సంద చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి సండ్ర వెంకట వీరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గత 9 ఏళ్ళుగా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని ఇక్కడ ప్రతి ఇంటి నుండి కనీసం ఒక వ్యక్తి సంక్షేమ పథకం యొక్క ప్రతిఫలాన్ని పొందారని పేద ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు వరుసగా మూడో విజయాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు నాలుగో విజయాన్ని అందించడానికి మనం పునరంగితం కావాలని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గుండ్ర రాఘవేంద్రరావు గారు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు గారు కౌన్సిలర్ సూరిబాబు గారు కోఆప్షన్ సభ్యులు తడిమళ్ళ ప్రకాష్ రావు గారు బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అంకం రాజుగారు బిఆర్ఎస్ నాయకులు నరుకుళ్ళ శ్రీను గారు మేకల నరసింహారావు గారు అబ్దుల్లా గారు వెనిగళ్ళ గోపి గారు వేములపల్లి మధు గారు మరికంటి శ్రీను గారు చింతల సత్యనారాయణ గారు , వల్లభనేని పవన్ గారు పర్వతనేని వేణు, కోట రాజ్ కుమార్, జొన్నలగడ్డ కృష్ణ, సతీష్ వీరేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు