తెలంగాణలో ఓట్ల కోసం కాంగ్రెస్.. బీజేపీ రెండు పార్టీలు చెప్పే మాయ, మోసపు మాటలు నమ్మే పరిస్థితి లేదు… ఆరు గ్యారంటీలని కాంగ్రెస్సోల్లు అంటున్నారు.. ఇన్నేళ్లు ఎటు పోయారు.. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ చెప్పేవన్నే అబద్దలేనని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
నిన్న మంగళవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని,మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం తధ్యమని అన్నారు.
దేశంలోనే తెలంగాణా ను అన్ని విధాలా నెంబర్ వన్ గా అభివృద్ధి చేసిన కేసీఆర్ కు అండగా నిలిచి, పట్టం కట్టాలన్నారు. మ్యానిఫెస్టో బ్రహ్మాండంగా ఉందన్నారు. ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని నామ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు