తెలంగాణలోని ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తనకు గౌరవంలేని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు మరి కాసేపట్లో ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు.సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం ఈ సాయంత్రం మేడ్చల్ సభలో ఆయన బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన చేతులు మీదుగా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జనగామకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.