తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవేరి సమేత మలయప్పస్వామి వైకుంఠనాథుని అవతారంలో తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
సోమవారం నాడు చిన శేష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో కలిసి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా… శ్రీవారు వాహన సేవలో తిరు వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మాడ వీధుల్లో స్వామి వారి సేవలో పాల్గొనడం మహాత్భాగ్యం అని మంత్రి పేర్కొన్నారు.