కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా, నెహ్రు నగర్ లో రూ. 93.2 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మార్కండేయ నగర్ లో రూ. 23.6 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, బసవతారకం నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, సంజయ్ గాంధీ నగర్ – బిక్కు భాయ్ బస్తి లో రూ. 15.00 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, సంజయ్ గాంధీ లో రూ. 137.9 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, కళావతి నగర్ లో రూ. 10.00 లక్షలతో కమ్యూనిటీ హాల్, శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి టెంపుల్కు పూర్తయిన రోడ్డు ను, రాజీవ్ గాంధీ నగర్ లో రూ. 100.00 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, నిర్మాణ పనులకు, కమ్యూనిటీ హాల్, వెంకట రాంనగర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, శ్రీరాంనగర్ లో రూ. 100.00 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, వైష్ణవి నగర్ లో రూ. 67.00 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, వేమారెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్, సి సి కెమెరాలు, సోనియా గాంధీ నగర్ లో రూ. 49.8 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, శ్రీకృష్ణ నగర్ లో రూ. 9.5 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, కమ్యూనిటీ హాల్, సూరారం లో రూ. 41.8 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, కమ్యూనిటీ హాల్, విశ్వకర్మ కాలనీ లో రూ. 16 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, పాదయాత్ర చేస్తూ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు.
ఈ సందర్భంగా బస్తీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజికవర్గంను అభివృద్ధిలో ముందుంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అది బిఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్ గారి నాయకత్వం లోనే సాధ్యం అయితుందని.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు, వివిధ శాఖల చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు, మహిళా నాయకురాలు, కాలనీ బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.