కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికుడ మండలంలో రూ.2కోట్ల 13లక్షలతో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. తెలంగాణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.రైతులను అరిగోస పెట్టిన కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతామన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమా, రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల రైతులకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.
అనంతరం బీసీ బంధు కింద రూ.లక్ష చెక్కులను, దళిత బంధు, మైనారిటీలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.బీఆర్‌ఎస్ గెలుపుతోనే రాష్ట్రానికి రక్షణ ఉంటుందన్నారు.మంచి చేసిన కేసీఆర్‌కు ప్రజలంతా మద్దతుగా నిలువాలని,మళ్లీ కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబందు కన్వీనర్లు, సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.