హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండల కేంద్రంలో రూ.3.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆఫ్ గ్రేడియేషన్ అడిషనల్ అదనపు తరగతి గదుల నిర్మాణం (బాలికల జూనియర్ కళాశాల) నూతన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణ లక్ష్మీ/ షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను తలదన్నేలా , ప్రభుత్వ విద్యాసంస్థల్లో ,గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పౌష్టిక ఆహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.గురుకుల హాస్టల్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.తొమ్మిదేళ్ల సుపరిపాలన.. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ర్టాభివృద్ధి.. సబ్బండవర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికే తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అన్నారు.ఈ కార్యక్రమంలో.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మండల,స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు