జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మున్సిపల్ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ బహిరంగ సభను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబోయే గద్వాలలోని వైఎస్సార్ చౌరస్థానందు మధ్యాహ్నం సమయంలో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఎంపీపీ వై.రాజారెడ్డి, జడ్పీటిసి వై.ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద ఈరన్న,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,మండల బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అజయ్ మండల ప్రజలకు పిలుపునిచ్చారు.
గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా నూతన కొత్త బస్టాండ్,ఇంటిగ్రేడ్ మార్కెట్ కు సంబంధించి ప్రారంభోత్సవం అదేవిధంగా గద్వాల నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం మెడికల్ కళాశాలతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.
కావున మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,సింగిల్ చైర్మన్, వైస్ చైర్మన్,సింగిల్ విండో డైరెక్టర్ లు,వార్డు మెంబర్లు,బిఆర్ఎస్ మండల,గ్రామ నాయకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండల బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అజయ్,నరేందర్,నాయకి మధు,జిల్లా ఉపసర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాల్వాయి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.