టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా పరమ రోతగా బిహేవ్ చేస్తాడు..బాలయ్య నోరు తెరిస్తే ఆయనకే అర్థం కాని గ్రాంథిక భాషలో సంస్కృతం, తెలుగు మిక్స్ చేసి డైలాగులు కొడుతుంటే..అహో ..ఓ హో..బాలయ్య చౌదరి మహా పండితుడంటూ..పచ్చ మీడియా బాకాలు ఊదుతుంటుంది..ఇక పబ్లిక్‌గా బాలయ్య చేసే వెకిలిచేష్టలకు అంతే ఉండదూ..ఇక బాలయ్యకు ఆడపిచ్చి కూడా కాస్తాంత ఎక్కువే సుమీ..అని టాలీవుడ్ జనాల్లో ఎవరిని అడిగినా చెబుతారు..గతంలో తెలుగు స్టార్ హీరో తో నటించేటప్పుడు తనతో పడుకోమని బలవంతం చేసాడని..అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదని..బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఇచ్చిన స్టేట్‌మెంట్ బాలయ్యని ఉద్దేశించే అని అందరికీ తెలిసిందే..ఇక తాతయ్య వయసులో ఉన్న బాలయ్య,..సభ్యతా, సంస్కారం లేకుండా..అమ్మాయి కనిపిస్తే ముద్దైనాపెట్టాలి..లేదా కడుపైనా చేయాలి అంటూ..సినిమా ఫంక్షన్‌లో తన కక్కుర్తిని బయటపెట్టుకుంటే.. మా బాలయ్య ఫ్యాన్స్ ని కొట్టినా.. హీరోయిన్ల తొడల మీద చేతులు వేసినా..వాళ్లని చూస్తూ పబ్లిక్‌గా పెదవి కొరికినా..మా బాలయ్య మగాడు అంటూ పచ్చ మీడియా వెనకేసుకువస్తోంది..ఇక పైసా వసూల్ సినిమాలో పిడికిలి బిగించి ..బాలయ్య చేసిన అసభ్య సంజ్ఞలకు కమ్మ జనాలు తెగ మురిసిపోతారు..కూతురు వయసున్న హీరోయిన్లతో అసభ్యంగా డ్యాన్సులు వేస్తున్నా..అది సినిమా కాబట్టి..ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు..కానీ పవిత్రమైన అసెంబ్లీలో కూడా..బాలయ్య తన వెకిలి చేష్టలను మానలేదు..
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు నానా రచ్చ చేసారు..స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభ జరగకుండా నినాదాలు చేస్తూ..రభస చేశారు..బాలయ్య అయితే హుందాతనం మరిచి…సినిమా లెవెల్లో మంత్రి అంబటి..స్పీకర్ తమ్మినేనికి ఎదురుగా వెళ్లి తొడలు కొట్టి..మీసం మేలేశాడు…బాలయ్య చేసిన ఓవరాక్షన్‌పై అంబటి , తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు..తొడ కొట్టుకోవాలనుకుంటే..సినిమాల్లో చేసుకో..అసెంబ్లీలో కాదు..అంతకు దమ్ముంటే రా చూసుకుందాం అంటూ బాలయ్యకు అంబటి సవాల్ విసిరారు..ఇక స్పీకర్ తమ్మినేని నిండు అసెంబ్లీలో తొడకొట్టిన బాలయ్యను మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నామని..సభను అగౌరపరిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు..ఇక సభను అడ్డుకుంటున్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్యతో సహా టీడీపీ ఎమ్మెల్యేంతా వాకౌట్ చేశారు..ఆ సమయంలో వెళ్తూ వెళ్తూ వైసీపీ ఎమ్మెల్యేల వంక చూస్తూ బాలయ్య చేతి పిడికిని మడిచి…అసభ్యంగా సంజ్ఞలు చేశాడు..బాలయ్య వెకిలి చేష్టలకు అక్కడకే ఉన్న వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు అసహ్యంతో తలదించుకున్నారు..ఇక టీడీపీ మహిళా ఎమ్మెల్యేలైతే మా బాలయ్య మహా పోటుగాడు అన్నట్లుగా తెగ నవ్వులు చిందించారు..పవిత్రమైన నిండు అసెంబ్లీలో కనీసం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా..బాలయ్య చేసిన అసభ్య ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..సినిమాల్లోనే కాదు..అసెంబ్లీలో కూడా నీ వెకిలిచేష్టలు మానవా బూతు బాలయ్య అంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు..బాలయ్య లాంటి దిగజారుడు వ్యక్తులు ఇలాంటి వెలికిచేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడనే చెప్పాలి.