Home / ANDHRAPRADESH / జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!

జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!

దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్‌ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో పాయిజన్ ఇచ్చి మా బాబుగారిని లేపేస్తారా ఏంటీ..ఇదంతా జగన్ కుట్ర అంటూ నిస్సిగ్గుగా ఎల్లో మీడియా దిగజారుడు ప్రచారానికి దిగింది..ఇంకో అడుగు ముందుకేసి…అసలు జైల్లో దోమలు తక్కువే ఉన్నాయి..కావాలని ఎక్కడి నుంచైనా దోమలను పట్టుకువచ్చి..బాబుగారి సెల్లో వేసి..ఆయన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ..పచ్చమీడియా కులపిచ్చి రిపోర్టర్..మైకు పట్టుకుని మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీ అల్లాడు..ఇప్పుడు సేమ్ టు సేమ్ నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించింది…భౌతికంగా అంతం చేయడానికే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..

రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఆయన్ని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని లోకేష్ పనికిమాలిన ఆరోపణలు చేశారు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా..ఇప్పటికే ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఎల్లోమీడియా సహకారంతో డ్రామాలు ఆడి ప్రజల్లో సింపతీ కొట్టేస్తాడని తెలిసినా..జగన్ ఏది జరిగినా..చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలకే మొగ్గు చూపారు..అలాంటిది ఇప్పుడు జైల్లో చంద్రబాబును అంతం చేస్తే..తన పార్టీ భవిష్యత్తుకు అది పెద్ద దెబ్బ అని తెలియని అమాయకుడేం కాదు…ఇక దోమల గురించి అంటారా..మన ఇంట్లో ఎన్ని కాయిల్స్, ఆలవుట్లు పెట్టినా దోమలు ఉంటూనే ఉంటాయి..ఇక జైల్లో అన్నాకా దోమలు ఉండవా..అయినా లోకేశంతో సహా టీడీపీ నేతలు దోమలతో మా బాబుగారిని కుట్టించి ఆయనకు డెంగ్యూ వచ్చేలా చేసి..ఆయన్ని అంతం చేయడానికి జగన్ కుట్ర చేస్తున్నాడంటూ నిస్సిగ్గుగా అడ్డగోలు ప్రచారానికి దిగారు. తాజాగా నారా లోకేష్ మా నాన్నారిని దోమలతో డెంగ్యూ వచ్చేలా చేసి..ఆయన్ని అంతం చేయడానికి జగన్ కుట్ర చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశాడు.

చంద్రబాబు గారిని సైకో జగన్ అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే డెంగ్యూ అనే పదాన్ని అదేదో మాటల్లో చెప్పలేని బూతు పదంలా పలికి…నవ్వుల పాలైన లోకేషం..ఇప్పుడు దోమలతో మా నాన్నారికి డెంగ్యూ వచ్చేలా చేసి అంతం చేసే కుట్ర చేస్తున్నారు..ఆయనకేమేనా అయితే జగన్ దే బాధ్యత అంటూ అంటున్నాడు.

అయ్యా లోకేషం..ముందు డెంగ్యూ అనే పదాన్ని బూతులా కాకుండా సరిగా పలకడం నేర్చుకో..అయినా బాబుగారికి డెంగ్యూ వచ్చినా ప్రాణాలకేం ప్రమాదం లేదు..జైలు అధికారులకు ఆయనకు ట్రీట్‌మెంట్ ఇస్తారు. .ఇంతకీ ఓ డౌట్..అసలు మీ నాన్నారికి జైల్లో దోమలు కుట్టి డెంగ్యూ వస్తుందనే బాధనా..లేక డెంగ్యూ వచ్చి ఏదైనా అయితే సీఎం సీట్లో కూర్చోవాలని మనసులో కోరుకుంటున్నావా…అయినా డెంగ్యూ వచ్చినా బాబుగారి ప్రాణాలకు ఏమైనా అయితే..ఎలా..అసలే విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారు..అప్పటి దాకా ఆయన ప్రాణాలకు మా ప్రాణం అడ్డూ..అంటూ సోషల్ మీడియాలో నెట్‌జన్లు లోకేష్ ట్వీట్‌కు కౌంటర్లు మీద కౌంటర్లు ఇస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat