ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చుకు సిద్ధమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు ఎంత సమయమైనా ఇస్తాం అని స్పష్టం చేశారు. అయినా టీడీపీ నేతలు పట్టించుకోలేదు..దీంతో మంత్రి అంబటి రాంబాబు సైతం కాస్త ఓపికపడితే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమని వెల్లడించారు. దీంతో రెచ్చిపోయిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సినీ స్టైల్లో స్పీకర్ వైపు, అంబటి వైపు చూస్తూ తొడకొట్టి మీసాలు మెలివేశారు. బాలయ్య ఓవరాక్షన్‌పై అంబటి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటరిచ్చారు. అయితే, స్పీకర్ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు తమ్మినేని.
కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్ హెచ్చరించారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు. ఇక, సభలో ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ తో పాటు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారు. అయితే నిండు అసెంబ్లీలో తొడలు కొట్టి, మీసం మెలేసిన బాలయ్య తీరును వైఎస్ఆర్‌సీపీ నేతలు ఖండిస్తున్నారు..బావ చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం తొడలు కొట్టడానికి, మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదు బాలయ్య…అసెంబ్లీ..ఇకనైనా ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది అంటూ చురకలు అంటిస్తున్నారు.