Home / ANDHRAPRADESH / చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!

చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంటే..ఆయన వల్ల లాభపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు ఒక్క మాట మాట్లాడరా అంటూ..టీడీపీ అనుకుల పచ్చ మీడియా గత 10 రోజులుగా టాలీవుడ ఇండస్ట్రీపై పడి ఏడుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు అయిన మురళీమోహన్, చంద్రబాబు వీరభక్తులైన అశ్వనీదత్తు, రాఘువేంద్రరావు తో పాటు నట్టికుమార్ వంటి చిన్న నిర్మాత తప్పా..సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, నటులు ఎవరూ చంద్రబాబు జైలుకు వెళ్లినా లైట్ తీసుకున్నారు…చంద్రబాబు జైలుకు వెళ్లిన బాధ కంటే కమ్మ కులాధిఫత్యంలో ఉన్న టాలీవుడ్ జనాలు పట్టించుకోలేదని టీడీపీ నేతలు తెగ ఫీల్ అయిపోతున్నారు. కమ్మ కులానికే చెందిన స్టార్ హీరోలు నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్‌,  ఆఖరికి నందమూరి కుటుంబానికే చెందిన జూ. ఎన్టీఆర్ కూడా  చంద్రబాబు అరెస్ట్ విషయంపై పెద్దగా స్పందించలేదు..పైగా దగ్గుబాటి రామానాయుడు గతంలో టీడీపీ ఎంపీగా పని చేశారు..ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్ కు కూడా చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది..అయినా వీళ్లంతా చంద్రబాబు జైలుకు వెళ్లినా లైట్ తీసుకున్నారు..

అయితే తాజాగా ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు. సప్త సాగరాలు అనే సినిమా ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్న దగ్గుబాటి సురేష్‌ను… చంద్రబాబు అరెస్ట్‌పై మీ స్పందన ఏంటని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీంతో దగ్గుబాటి సూటిగా…సినిమా వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా సినిమా వ్యాపారం చేసుకోవడం మంచిదని హితవుపలికారు. సినిమా రంగం రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్నారు.చంద్రబాబు అరెస్ట్‌ అనేది సున్నితమైన అంశం. దీనిపై ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా కాదు.. కేవలం సినిమాలు చేసుకునే వాళ్లం. తెలుగు దేశం పార్టీకీ సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో సినిమా వాళ్లు స్పందించడం సరికాదు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదని నా అభిప్రాయం’అని సురేశ్‌ బాబు తేల్చిచెప్పారు.

పరిశ్రమ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలామంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. పరిశ్రమ తరఫున ఎప్పుడూ పొలిటికల్ స్టేట్ మెంట్స్ రావు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆంధ్రా-తెలంగాణ ఇష్యూ జరిగినప్పుడు కూడా పరిశ్రమ తరఫున ఎప్పుడూ ఎలాంటి స్టేట్ మెంట్స్ రాలేదు. మేం మూవీ మేకర్స్, సినిమాలు మాత్రమే తీస్తాం. చాలామంది స్టేట్ మెంట్స్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం. రోజూ ఏదో ఒకటి జరుగుతుంటుంది. ప్రతి అంశంపై స్టేట్ మెంట్ ఇవ్వలేం కదా.” అంటూ చంద్రబాబు అరెస్ట్ అయినా..జైలుకు వెళ్లినా ఇండస్ట్రీకేం సంబంధమంటూ దగ్గుబాటి సురేష్ కుండబద్ధలు కొట్టారు.

గతంలో తన తండ్రి టీడీపీలో ఉన్నారని, తను కూడా పార్టీ కోసం పనిచేశానని, కాబట్టి వ్యక్తిగత స్థాయిలో తను స్పందించగలనని, పరిశ్రమ తరఫున మాత్రం తాను స్పందించనని కుండబద్దలుకొట్టారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎవరైతే సింపతీ చూపిస్తున్నారో, వాళ్లకు ఆ సింపతీ ఎప్పుడూ ఉంటుందని, అంతకుమించి ఆశించొద్దు అంటూ కొంతమంది కమ్మ కుల సినీ పెద్దలకు, పచ్చ మీడియా ఛానళ్లకు తేల్చి చెప్పారు..

నిజమే కదా..సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌తో పాటు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎంతో సహకారం అందించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాకా…తెలంగాణలో కేసీఆర్ సర్కార్ టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోంది..సినీ పెద్దలు అడిగిందే తడవుగా సకల సౌకర్యాలు కల్పిస్తోంది..అన్ని విధాల సహ‍కారం అందిస్తోంది.. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన కమ్మ కులానికే చెందిన రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ పదవి, అశ్వనీదత్తుకు గన్నవరం దగ్గర ల్యాండ్ ..ఇలా తన కులపోళ్లకే దోచిపెట్టాడే తప్పా..మిగిలిన ఇండస్ట్రీ నిర్మాతలకు పెద్దగా ఒరగబెట్టిందేమి లేదు..అందుకే చంద్రబాబు జైలుకు వెళ్లినా కమ్మ కులం ఆధిఫత్యం ఉన్న టాలీవుడ్ నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది…అయినా చంద్రబాబుకు సమస్య వస్తే…అది ఆ‍యన వ్యక్తిగత సమస్యే..కానీ తనకు తాను దైవాంశ సంభూతుడిని అని..తన సమస్యనే ప్రజలంతా తమ సమస్యగా భావించాలనే చంద్రబాబు అతి…పచ్చ మీడయా పైత్యం వెరసీ చంద్రబాబును ప్రతి ఒక్కరూ ఛీత్కరించేలా చేస్తోంది..ఆఖరకు తమ కమ్మ కులానికే చెందిన దగ్గుబాటి సురేష్ కూడా చంద్రబాబు జైలుకు వెళితే..ఇండస్ట్రీకేం సంబంధం అంటూ టీడీపీ నేతలకు, పచ్చ మీడియాకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat