Home / ANDHRAPRADESH / ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదు..!

ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదు..!

45 ఏళ్లలో రాజకీయ జీవితంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..తన కులానికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతూ..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ, 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు అధిపతి అయిన స్కామ్‌‌స్టర్ చంద్రబాబు చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలకు, అనుకుల పచ్చ మీడియాకు పిచ్చెక్కిపోతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయంగా వాడుకుని ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి, బాలయ్యలు తెగ ప్రయత్నించారు..ఆఖరికి దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌తో రోడ్ల మీద పడుకోబెట్టి డ్రామాలు చేయించారు..అయినా ప్రజల్లో పెద్దగా సానుభూతి వర్కవుట్ కాకపోవడంతో లోకేష్ భార్య బ్రాహ్మణిని తీసుకొచ్చారు. అయితే రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బ్రాహ్మణీ ఉన్న పరువు కాస్తా పోగొట్టింది..చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారని, కనీసం రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబు పేరులేదని..ఆ విషయం తమ 8 ఏళ్ల కుమారుడు దేవాన్ష్‌ని అడిగినా చెబుతారంటూ..బ్రాహ్మణీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తెగ ఆడేసుకుంటున్నారు..

ఇక చంద్రబాబు పేరేత్తితే చెలరేగిపోయే మంత్రి రోజా బ్రాహ్మణీ కామెంట్స్‌కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. అసలు సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ.. జైలర్‌ సినిమాకు పంపుతారా? అంటూ బ్రాహ్మణీకి జబర్దస్త పంచ్ ఇచ్చారు..చంద్రబాబు, లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను బ్రాహ్మణీ బట్టీపట్టి చదవిందని ఎద్దేవా చేశారు.. అలాగే, దేవాన్షుకి దయచేసి బాబు రిమాండ్‌ రిపోర్ట్‌ చూపించొద్దు. వాళ్ల తాత ఎంతపెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది…ఇంకా నయం చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి రప్పించిన ఖరీదైన లాయర్ లూథ్రాకు బదులుగా దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదంటూ..బ్రాహ్మణికీ రోజా జబర్దస్త్ కౌంటర్ ఇచ్చారు. అయినా మీ మామ గురించి మీ తాత ఎన్టీఆర్‌ చివరి క్షణాల్లో విడుదల చేసిన వీడియో చూడు. చంద్రబాబు గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం అని స్వయంగా ఎన్టీఆర్‌ విలపించారు. మీ మామ నిరపరాధని మీ దగ్గర ఆధారాలుంటే మీడియాలో కాదు కోర్టుల్లో చూపించాలి… ఇక స్కిల్‌ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు పాత్రధారులందరూ జైలుకెళ్లకతప్పదని రోజా స్పష్టం చేశారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి కోసం టీడీపీ ప్రయోగించిన బ్రాహ్మణీ అస్త్రం కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat