గత పదేళ్లుగా చంద్రబాబు దత్తపుత్రుడిగా…టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. ప్యాకేజీ బంధమో..లేక మరేదైనా రుణానుబంధమో..తెలియదు కానీ..తన తల్లిని , తన అన్నను ఎల్లోమీడియాతో తిట్టించిన సంగతిని మర్చిపోయాడు..తనను మోదీ దత్తపుత్రుడంటూ ఎక్కెసమాడిన దత్తతమ్ముడు లోకేష్‌ని క్షమించాడు..జనసేనలో పవన్‌తో తిరిగేవాళ్లంతా అలగా జనం అంటూ అవమానించిన బాలయ్యతో కలిసి భయ్యా అంటూ భుజం కలిపాడు..ఓ పక్క కాపురం చేస్తున్న బీజేపీకి చెప్పాపెట్టకుండా…టీడీపీతో రాజకీయ వ్యభిచారానికి సిద్ధమైపోయిన పవన్ నిస్సిగ్గుగా కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మ కుల గురువు అయిన చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టి మరీ…రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు లెక్కిస్తున్న ఊచల సాక్షిగా…టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాడు.చంద్రబాబుతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు కురుస్తున్నాయి.
ఇన్నాళ్లు చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలను పవన్ కల్యాణ్ ఒక్క ప్రకటనతో నిజం చేసినట్లైంది. టీడీపీతో పొత్తుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కల్యాణ్‌ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నుంచి రూ.1,500 కోట్లు పవన్‌కు ముట్టాయని కేఏ పాల్ ఆరోపించారు. విశాఖలోని ఆశీలమెట్టలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కుక్కలాగా అమ్ముడు పోయాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని, అందువల్లే పవన్ వెంట కాపులు లేరన్నారు.వారిద్దరూ కాపులను అమ్ముకోవడానికే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు పెట్టారని చిరంజీవి, పవన్‌లపై విరుచుకుపడ్డారు.. 2019లో జనసేనలో లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ ఇద్దరే చేరారని, ఎన్నికలు అయిపోయిన వెంటనే వారూ బయటకు వచ్చారని గుర్తు చేశారు. మొత్తంగా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ రూ. 1500 కోట్లకు అమ్ముడుపోయాడంటూ కేఏపాల్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పవన్ చంద్రబాబు దత్తపుత్రుడు..ప్యాకేజీ స్టార్ అని కేఏపాల్ చెప్పకనే చెప్పాడని జనసేనాని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.