తెలంగాణలో జాతీయ సమైక్యతా దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ .
అనంతరం చెరువు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, మట్టిని దేవుడు గా చేద్దాం… భక్తి ని పూజగా అర్పిద్దాం.. ఉద్దేశం తో నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని వినాయక విగ్రహాలను జిల్లా అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష పాల్గొన్నారు